తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ రాజమన్నార్ అలంకారంలో దర్శనమిచ్చారు. ఆలయంలోని కల్యాణమండపంలో నిర్వహించిన కల్పవృక్ష వాహన సేవలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు చర్నాకోలా, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు వైదికకార్యక్రమాలను నిర్వహించారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
TTD: కల్పవృక్ష వాహన సేవలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి - tirumala news
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మలయప్పస్వామివారు కల్పవృక్ష వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కల్పవృక్ష వాహన సేవ