ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

justice nv ramana
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ

By

Published : Dec 18, 2020, 11:50 AM IST

తిరుమల శ్రీవారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో సతీసమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులకు పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు. ఆయన వెంట ఆలయ అదనపు ఈవో ధర్మారెడ్డి ఉన్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి... బేడీ ఆంజనేయస్వామివారిని దర్శించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details