జాతీయ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా తిరుపతిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసన కార్యక్రమం కొలిక్కి వచ్చింది. తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా పాలనాధికారి భరత్ గుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్ కలిసి తిరుపతిలోని వైద్య విద్యార్థులతో చర్చించారు. ఇందులో వైద్య విద్యార్థులు తమ డిమాండ్లను అధికారుల ముందుకు తీసుకొచ్చారు. ఇటీవల అలిపిరి కూడలి వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వైద్య విద్యార్థులపై దాడి చేసిన విజిలెన్స్ అధికారి అశోక్ గౌడ్‌పై చర్యలు తీసుకోవాలని విన్నవించారు. దీనిపై జిల్లా పాలనాధికారి, ఎస్పీ అన్బురాజన్ స్పందిస్తూ చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో వైద్య విద్యార్థులు తమ నిరసన కార్యక్రమాన్ని విరమించుకొని విధులకు హాజరవుతామని తెలిపారు.
తిరుపతిలో జూడాల నిరసన విరమణ - dharna
తిరుపతిలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన నిరసనను విరమించుకున్నారు. జాతీయ మెడికల్ కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాన్ని సఫలం చేసుకున్నారు. ప్రభుత్వం వారి డిమాండ్లకు తలొగ్గింది.

తిరుపతిలో విరమించుకున్న జూడాల నిరసన