ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తితిదే వసతి గృహాల్లో జేఈవో ఆకస్మిక తనిఖీ - TTD Latest News

తితిదే నిర్మించిన వసతి సముదాయాలను.. జేఈవో సదాభార్గవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విష్ణు నివాసంలోని శ్రీవారి సేవ కార్యాలయాన్ని పరిశీలించారు. యాత్రికులకు 24 గంటలూ శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. ఒక హాల్లో 40 మందికి మించి వసతి కల్పించవద్దని అధికారులకు సూచించారు.

తితిదే వసతి గృహాల్లో జేఈవో ఆకస్మిక తనిఖీ
తితిదే వసతి గృహాల్లో జేఈవో ఆకస్మిక తనిఖీ

By

Published : Mar 9, 2021, 8:38 PM IST

శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసం తిరుపతిలో తితిదే నిర్మించిన వసతి సముదాయాలను... జేఈవో సదాభార్గవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్వీ విశ్రాంతి గృహం, విష్ణునివాసం, గోవిందరాజ స్వామి రెండు, మూడు సత్రాలను పరిశీలించారు. ఎస్వీ విశ్రాంతి గృహం, సత్రాలలో వాహనాల పార్కింగ్ క్రమ పద్ధతిలో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

విష్ణు నివాసంలో యాత్రికులతో మాట్లాడిన జేఈవో... వారికి అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. విష్ణు నివాసంలోని శ్రీవారి సేవ కార్యాలయాన్ని పరిశీలించారు. కరోనా నిబంధనల మేరకు శ్రీవారి సేవకులకు ఒక హాల్లో 40 మందికి మించి వసతి కల్పించవద్దని అధికారులకు సూచించారు. ఉపయోగించని, పాడైన ఫర్నీచర్, ఇతర సామగ్రిని స్టోర్​కు తరలించి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. యాత్రికులకు 24 గంటలూ శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి: నాదెండ్ల మనోహర్

ABOUT THE AUTHOR

...view details