ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 24, 2021, 9:01 PM IST

ETV Bharat / city

'కరోనా సోకిన తితిదే సిబ్బందికి.. మాధవం క్వారంటైన్ కేంద్రంలో మెరుగైన వైద్యం'

తితిదే ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని... జేఈవో సదాభార్గవి ఆదేశించారు. మాధవం క్వారంటైన్ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. హోం క్వారంటైన్​లో ఉన్న ఉద్యోగులకు కిట్స్ అందించి, వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

క్వారంటైన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జేఈవో సదాభార్గవి
క్వారంటైన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన జేఈవో సదాభార్గవి

కరోనా చికిత్స కోసం క్వారంటైన్ కేంద్రాలకు వచ్చే తితిదే ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించాలని... జేఈవో సదాభార్గవి ఆదేశించారు. తితిదే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకోసం ఏర్పాటు చేసిన మాధవం క్వారంటైన్ కేంద్రాన్ని ఆమె తనిఖీ చేశారు. బెడ్లు, మందులు, పారిశుద్ధ్యం, వైద్యులు, సిబ్బంది అందుబాటు పరిస్థితులను ఆమె పరిశీలించారు. వైద్య సిబ్బందికి అందుబాటులో ఉన్న పీపీఈ కిట్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్​లను పరిశీలించారు.

కరోనా బారిన పడిన తితిదే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవడానికి మందులు, పోషకాహారంతో పాటు యోగా తరగతులు ఏర్పాటు చేయాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మాధవంలో అవసరమైన ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. హోం క్వారంటైన్​లో ఉన్న ఉద్యోగులకు కిట్స్ అందించి, వారి ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుసుకునే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details