ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నడ్డాకు ఘన స్వాగతం పలకండి: జనసైనికులకు నాదెండ్ల పిలుపు - నాయుడుపేట బహిరంగ సభకు పవన్ రాకపై నాదెండ్ల స్పష్టత

జనసేన శాసనసభ నియోజకవర్గ బాధ్యులతో.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్​ నాదెండ్ల మనోహర్ తిరుపతిలో సమావేశమయ్యారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరగనున్న బహిరంగ సభకు వస్తున్న భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు.. ఘన స్వాగతం పలకాలన్నారు.

nadendla manohar, nadendla manohar met with assembly constituency incharges in tirupati
నాదెండ్ల మనోహర్, అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులతో నాదెండ్ల సమావేశం

By

Published : Apr 12, 2021, 7:20 AM IST

తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక జనసేనకు వార్మప్ మ్యాచ్ లాంటిదని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతిలో జనసేన శాసనసభ నియోజకవర్గ బాధ్యులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.

పవన్ కల్యాణ్ హోమ్ ఐసోలేషన్​లో ఉన్న కారణంగా.. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో నిర్వహించతలపెట్టిన ప్రచార సభలో ఆయన పాల్గొనే అవకాశం లేదని నాదెండ్ల తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం జనసైనికులు శాయశక్తులా కృషి చేయాలని కోరారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details