స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం కాబట్టి తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉపఎన్నిక వైపు దేశమంతా చూస్తుందని... దేశం మొత్తం ఏపీ వైపు చూసేలా ఫలితాలు ఉండాలని... మన అభ్యర్థికి వచ్చే మెజారిటీ మనమివ్వగలిగే సందేశం కావాలని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు స్థానిక ఎమ్మెల్యేలతోపాటు బయట నుంచి మరో ఎమ్మెల్యే, ఒక మంత్రి చొప్పున బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఈనెల 25 నుంచి క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. పోలింగ్ వరకు బాధ్యులంతా వారికి అప్పగించిన ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశించారు.
అతి విశ్వాసం వద్దు.. అందరూ సమన్వయం చేసుకుని చిత్తశుద్ధితో పనిచేసి గురుమూర్తిని మంచి మెజారిటీతో గెలిపించాలి. 2019లో మన పార్టీ అభ్యర్థికి వచ్చిన మెజారిటీ కంటే ఇప్పుడు ఎక్కువ రావాలి. చాలామంది మనం సంక్షేమం మాత్రమే చేస్తున్నాం, అభివృద్ధి ఎక్కడా లేదంటూ మాట్లాడుతున్నారు. క్షేత్రస్థాయిలో పాఠశాలు, వైద్యశాలలు అభివృద్ధి చేస్తున్నామని.. గ్రామ/వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, పాలకేంద్రాలు తదితరాలన్నింటినీ తీసుకువచ్చామని, ఇవన్నీ అభివృద్ధి సంకేతాలని వివరించండి. ఇదే అభివృద్ధిని, సంక్షేమాన్ని రాబోయే రోజుల్లోనూ కొనసాగిస్తామని గడపగడపకూ వెళ్లి చెప్పండి.-జగన్
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎన్నికలను సమన్వయం చేస్తారని, తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయం నుంచి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తారని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. పరిస్థితిని బట్టి తానూ ఎన్నికల ప్రచారానికి వస్తానని సీఎం చెప్పారు.
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బాధ్యులు:
తిరుపతి -మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి