ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ISRO Chairman Somnath: "దేశంలో నూతన సాంకేతికత రూపుదిద్దుకోవాలి" - తిరుపతి జిల్లా తాజా వార్తలు

ISRO Chairman: దేశంలో నూతన సాంకేతికత రూపుదిద్దుకోవాలని ఇస్రో చైర్మన్ ఆకాంక్షించారు. ప్రపంచ అవసరాలు తీర్చేదిశగా ఇస్రో సేవలందిస్తోందని ఆయన అన్నారు. సాంకేతిక నైపుణ్యాల సహకారానికి ఎన్‌ఏఆర్‌ రాడార్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.

ISRO Chairman
ఇస్రో చైర్మన్ సోమనాథ్

By

Published : Apr 7, 2022, 12:34 PM IST

ISRO Chairman: దేశంలో నూతన సాంకేతిక పరిజ్ఞానం రూపుదిద్దుకోవాల్సిన అవసరం ఉందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. తిరుపతి ఐఐటీ 7వ వార్షికోత్సవ సభలో పాల్గొన్న ఆయన విద్యార్థులు నైపుణ్యాలు మెరుగుపరుచుకుని దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. కాలానుగుణంగా నైపుణ్యాలను పెంచుకుంటూ ప్రపంచ అవసరాలు తీర్చేదిశగా ఇస్రో ప్రయాణిస్తోందని తెలిపారు. ఆరేళ్ల కాలంలో ఐఐటీ సాధించిన ప్రగతి, వివిధ సంస్థలతో పరిశోధనలో సహకారంపై ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్​. సత్యనారాయణ సోమనాథ్‌కు వివరించారు. ఇస్రో చైర్మన్ ఆధ్వర్యంలో ఐఐటీ సాంకేతిక నైపుణ్యాల సహకారానికి ఎన్‌ఏఆర్‌ రాడార్‌తో ఐఐటీ డైరెక్టర్ ఒప్పందం కుదుర్చుకున్నారు.

ఇదీ చదవండి: సింహాచలం ఆలయానికి నూతన పాలకవర్గం... ఛైర్మన్​గా అశోక్​గజపతిరాజు కొనసాగింపు

ABOUT THE AUTHOR

...view details