ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ISO Certificates: తితిదే ఆధ్వర్యంలోని కళాశాలలకు ఐఎస్​వో గుర్తింపు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహ‌ణ‌లోని పలు కళాశాలలు మూడు విభాగాల్లో ఐఎస్​వో (ISO) గుర్తింపు పొందాయి. ఈ మేరకు ఐఎస్‌వో ప్రతినిధులు తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డికి సంబంధిత ధ్రువపత్రాలు అందజేశారు.

తితిదే ఆధ్వర్యంలోని కళాశాలలకు ఐఎస్​వో గుర్తింపు
తితిదే ఆధ్వర్యంలోని కళాశాలలకు ఐఎస్​వో గుర్తింపు

By

Published : Sep 3, 2021, 8:58 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిర్వహ‌ణ‌లోని ఎస్వీ ఆర్ట్స్‌ క‌ళాశాల, శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ, పీజీ క‌ళాశాల, శ్రీ గోవింద‌రాజ స్వామి ఆర్ట్స్ క‌ళాశాలలు ఐఎస్​వో (ISO) గుర్తింపు పత్రాలు పొందాయి. ఈ మేరకు ఐఎస్‌వో ప్రతినిధులు తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డికి సంబంధిత ధ్రువపత్రాలు అందజేశారు.

క‌ళాశాల‌ల్లో డాక్యుమెంట్ల నిర్వహ‌ణ‌, ఉత్తమ మౌలిక స‌దుపాయాలు, ఉత్తమ విద్యా ప్రమాణాల నిర్వహ‌ణ‌కు సంబంధించి ఐఎస్​వో-9001 సాధించాయి. క‌ళాశాల‌ల్లో ప‌చ్చద‌నం పెంపొందించ‌డం, వ‌ర్షపు నీటిని సంర‌క్షించ‌డం, ప్లాస్టిక్ ఇత‌ర వ్యర్థ ప‌దార్థాల నిర్వహ‌ణ‌కు సంబంధించి ఐఎస్​వో-14001 స‌ర్టిఫికెట్‌ను కళాశాలలు దక్కించుకున్నాయి. క‌ళాశాల‌ల కార్యాల‌యాలు, త‌ర‌గ‌తి గ‌దులు, ల్యాబ్‌లు, హాస్టల్ భ‌వ‌నాల్లో విద్యుత్ పొదుపున‌కు సంబంధించి ఐఎస్​వో-50001 స‌ర్టిఫికెట్​ను పొందాయి.

తితిదే క‌ళాశాల‌ల్లో శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహ‌ణ‌, కరోనా నిబంధనల అమలు మెరుగ్గా ఉన్నాయని ఐఎస్​వో స‌ర్టిఫికేష‌న్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ ఆల‌పాటి శివ‌య్య, డైరెక్టర్ మౌళిక అభినందించారు. ఐఎస్​వో గుర్తింపు పొందటానికి కృషి చేసిన జేఈవో స‌దా భార్గవి, తితిదే విద్యాశాఖాధికారి గోవింద‌రాజ‌న్, కళాశాలల సిబ్బందిని ఈవో అభినందించారు.

ఇదీ చదవండి

TTD: వేద పాఠశాలల్లో ప్రవేశాలకు గడువును పొడగించిన తితిదే

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details