ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా అంటే ఎలా నిర్వహిస్తారు?... ప్రత్యేకతేంటి? - తిరుమల బ్రహ్మోత్సవాలు 2020

తితిదే చరిత్రలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు తొలిసారి ఏకాంతంగా జరగనున్నాయి. ప్రతి ఏటా లక్షల మంది భక్తుల గోవిందనామస్మరణ మధ్య వైభవంగా సాగే బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది ఆలయ ప్రాకారంలోనే సాగనున్నాయి. కరోనా నేపథ్యంలో ఏకాంతంగా నిర్వహించాలని తితిదే తీసుకున్న నిర్ణయంతో బ్రహ్మోత్సవాలు నిరాడంబరంగా సాగనున్నాయి. ఆలయ ప్రాకారంలోని సంపంగి మండపంలో వాహన సేవలను నిర్వహించనున్నారు. వైఖానస ఆగమశాస్త్రం మేరకు వైదిక కార్యక్రమాలకు లోటు లేకుండా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. విమానప్రాకారంలో ప్రదక్షిణలు, సంపంగి మండపంలో వాహనంపై శ్రీవారు కోలువుతీరడం వంటి కార్యక్రమాలతో బ్రహ్మోత్సవ వాహన సేవలు సాగనున్నాయి. బ్రహ్మోత్సవాలపై ఈటీవీ భారత్ తో ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు మరిన్ని వివరాలు పంచుకున్నారు.

ttd chief priest venugopala dikshitulu
ttd chief priest venugopala dikshitulu

By

Published : Sep 15, 2020, 6:03 PM IST

ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాల దీక్షితులతో ఈటీవీ భారత్​ ముఖాముఖి

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details