Interview with TTD EO: సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించామని తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ముగిశాయని తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి నేటి వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరిగాయని తెలిపారు.
సీఎం జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారని.. బ్రహ్మోత్సవాల్లో 5.69 లక్షల మంది భక్తులకు సర్వదర్శనం కల్పించామన్నారు. బ్రహ్మోత్సవాల్లో 24 లక్షల లడ్డు విక్రయాలు జరిగాయన్నారు. బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి రూ.20.43 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందన్నారు. ఈ ఏడాది కార్తిక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.