ఎవరి మతాలను వారు గౌరవించటం తప్పులేదు కానీ, ఇతర మతాలను కావాలని కించపరచటం చూడటం దారుణమని ఇండో అమెరికన్ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ అన్నారు. హిందూ సంప్రదాయాలను చులకన చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆధ్యాత్మిక చింతనకు, హైందవ మతానికి ప్రతీకైన తిరుమల కేంద్రంగా అన్యమత ప్రచారం జరుగుతుందని.. ఈ విషయం కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందన్నారు.
'తితిదే వేదికగా అన్యమత ప్రచారం జరుగుతోంది' - news on other religion propagation at tirupathi
తిరుమల కేంద్రంగా అన్యమత ప్రచారం జరుగుతోందని ఇండో అమెరికన్ బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ అన్నారు. తితిదేకు హైందవ దాతలు ఇచ్చే విరాళాలను అన్యమత ప్రచారం కోసం ప్రభుత్వం వాడుతుందని ఆరోపించారు.

ind-american-brahman-welfare-association-chairman
గతంలో అన్యమతస్థులు తిరుమల దేవస్థానంలోకి వెళ్లాలంటే డిక్లరేషన్ ఫాంపై సంతకం చేసేవారని., అలా చేయకుండా ఎంతోమంది ఇప్పటికీ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శిస్తున్నారని ఆరోపించారు. తితిదే మాస పత్రికతో పాటు అన్యమత పత్రికను పంపడాన్ని తప్పుబట్టారు. తితిదేకు హైందవ దాతలు ఇచ్చే విరాళాలను అన్యమత ప్రచారం కోసం ప్రభుత్వం వాడుతుందని ఆరోపించారు. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపించి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: బ్యాగు మోత తగ్గించే బోధన