ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HANUMAN BIRTHPLACE: హనుమ జన్మస్థల సుందరీకరణ పనులు ప్రారంభం

తిరుమల శ్రీవారిని పలువురు స్వామీజీలు దర్శించుకున్నారు. అనంతరం అకాశగంగ సమీపంలో టీటీడీ చేపట్టిన హనుమ జన్మస్థల సుందరీకరణ పనులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులతో ధార్మిక సదస్సు నిర్వహించాలని.. తితిదేని స్వరూపానందేంద్ర సరస్వతి కోరారు.

హనుమ జన్మస్థల సుందరీకరణ పనులు ప్రారంభోత్సవం
హనుమ జన్మస్థల సుందరీకరణ పనులు ప్రారంభోత్సవం

By

Published : Feb 16, 2022, 10:40 AM IST

ఆకాశగంగ ప్రాంతంలో హనుమ జన్మస్థల సుందరీకరణ పనులు ప్రారంభమయ్యాయి. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మఠాధిపతులు, పీఠాధిపతులతో ధార్మిక సదస్సు నిర్వహించాలని... తితిదేని స్వరూపనందేంద్ర సరస్వతి కోరారు. చిత్రకూట్ పీఠాధిపతి రామభద్రాచార్య, రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు కోశాధికారి స్వామిగోవిందదేవ్ గిరి, వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త కార్యదర్శి కోటేశ్వరశర్మ, తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details