ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ARREST: వాహనం ఆపకుండా దూసుకెళ్లారు..వెంబడించి పట్టుకున్న పోలీసులు - valmiki puram police latest news

చిత్తూరు జిల్లా కంభంవారిపల్లిలో టమాటా ట్రేల కింద ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న తమిళనాడుకు చెందిన 23 మంది స్మగ్లర్లను వాల్మీకిపురం, పీలేరు పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్
ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

By

Published : Aug 10, 2021, 6:59 PM IST


చిత్తూరు జిల్లా కంభంవారిపల్లి మండలంలో సుమారు రూ.60 లక్షల విలువచేసే 41 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన 23 మంది స్మగ్లర్లను అరెస్టు చేశారు. కంభంవారిపల్లి మండలంలోని నూతన కాలవ అటవీ ప్రాంతంలో వాల్మీకిపురం, పీలేరు పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. టమాటా ట్రేల లోడుతో వెళ్తున్న ఐషర్ వాహనం ఆపకుండా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. అనంతరం వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా.. ఎర్రచందనం దుంగలు బయటపడ్డాయి.

వాహనంలో ఉన్న తమిళనాడుకు చెందిన 23 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మరో పది మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక టీమ్​లను ఏర్పాటు చేసి గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు. వాల్మీకిపురం, పీలేరు సీఐలు నాగార్జున రెడ్డి, సాదిక్ ఆలీ, విక్రమ్​లు తమ సిబ్బందితో తనిఖీ వివరాలను వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details