ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై పోలీసుల ఉక్కుపాదం - నార్పల మండలం

అనంతపురం, చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. కేసులు నమోదు చేసి.. వాహనాలను సీజ్​ చేశారు.

illegal ration transport
అక్రమంగా రేషన్ బియ్యం తరలింపుపై పోలీసుల ఉక్కుపాదం

By

Published : Mar 25, 2021, 7:12 PM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాళహస్తి మండలంలోని రాచగన్నేరి సమీపంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.

పోలీసుల దాడిలో 71 బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ కృష్ణమోహన్ వెల్లడించారు. ఈ దాడిలో ఓ వ్యక్తిని అరెస్ట్​ చేయగా.. బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉంచిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్​కు తరలించారు.

అనంతలో..

అనంతపురం జిల్లా నార్పల మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. నార్పల క్రాసింగ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. రెండు ఆటోలలో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పోలీసులు గుర్తించారు. ప్రజల (లబ్దిదారుల) నుంచి బియ్యాన్ని సేకరించి ఇతర ప్రాంతాల్లో అమ్మేందుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్​ చేసిన పోలీసులు.. ఆటోలను సీజ్ చేశారు.

ఇదీ చదవండి:

ఏసీబీ భయంతో 20 లక్షలు తగలబెట్టిన తహసీల్దార్

ABOUT THE AUTHOR

...view details