ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అక్రమంగా మద్యం తరలింపు.. 12 మంది అరెస్ట్ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. చిత్తూరులో తమిళనాడుకు తరలిస్తున్న 293 మద్యం బాటిళ్లను పట్టుకోగా.. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద 260 తెలంగాణ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

illegal liquor transport
అక్రమంగా మద్యం తరలింపు

By

Published : Jun 9, 2021, 9:40 PM IST

రాష్ట్రం నుంచి తమిళనాడుకు అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని తూగుండ్రం, ఠాణా కూడళ్లలో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న వ్యక్తులను పోలీసులు గుర్తించారు. వీరినుంచి రూ.30 వేలు విలువచేసే 293 మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నామని.. 12 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

పొందుగల చెక్ పోస్ట్ వద్ద తెలంగాణ మద్యం పట్టివేత..

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న 260 తెలంగాణ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నల్గొండ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నట్లు తెలిపాడని పోలీసులు చెప్పారు. అతన్ని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:Three snakes dancing: పాముల సయ్యాట..వీడియో వైరల్!

ABOUT THE AUTHOR

...view details