ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మద్యం, గుట్కా ప్యాకెట్ల అక్రమ రవాణా ముఠా అరెస్టు..

కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం, నిషేధిత గుట్కా ప్యాకెట్లు రవాణా చేస్తున్న ముఠాను ఎస్​ఈబీ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 50 లక్షల రూపాయల విలువైన.. కర్ణాటక మద్యాన్ని, నిషేధిత గుట్కా ప్యాకెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.

By

Published : Jun 17, 2021, 7:49 PM IST

illegal liquor supply gang  arrest
మద్యం రవాణ చేస్తున్న ముఠా అరెస్ట్

కర్ణాటక నుంచి అక్రమ మార్గాల్లో మద్యం, గంజాయి, నిషేధిత గుట్కా ప్యాకెట్లను పెద్దమొత్తంలో చిత్తూరు జిల్లాకు తీసుకొస్తున్న మూడు ముఠాలను స్పెషల్ ఎన్​ఫోర్స్​మెంట్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. రెండు రోజులుగా తవణంపల్లె మండలం పరిసర ప్రాంతాల్లో నిఘా ఉంచిన పోలీసులు, ఎస్ఈబీ అధికారులు.. వేర్వేరుగా మూడు ముఠాలకు సంబంధించిన పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

పట్టుబడిన వారి నుంచి సుమారు 50 లక్షల రూపాయల విలువైన.. కర్ణాటక మద్యాన్ని, నిషేధిత గుట్కా ప్యాకెట్లు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సరుకు రవాణ కోసం వినియోగించిన కారు, ఆటో, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశామని చిత్తూరు జిల్లా ఎస్ఈబీ ఏఎస్పీ రిషాంత్ రెడ్డి తెలిపారు. ముఠాలతో సంబంధం ఉన్న మరింత మందిని త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు.

గంజాయి తరలిస్తున్న వ్యక్తుల అరెస్ట్

కర్ణాటకకు గంజాయి తరలిస్తున్న నలుగురి అరెస్ట్

కర్ణాటకకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న నలుగురిని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం నియోజకవర్గం నుంచి సరిహద్దు మండలాల మీదుగా కర్ణాటకకు గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు కళ్యాణదుర్గం సీఐ తేజో మూర్తి వివరించారు. వీరి నుంచి 500 గ్రాములు గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధం ఉన్న మరో ఇద్దరూ కర్ణాటకకు చెందిన వ్యక్తులు పరారీలో ఉన్నట్లు పోలీసులు అధికారులు వెల్లడించారు. గంజాయి అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకున్న ఎస్ఐలు, సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.

ABOUT THE AUTHOR

...view details