ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తిరుపతిలో లైట్ మెట్రో రవాణా బెటర్' - హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వార్తలు

తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి భేటీ అయ్యారు. తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్ తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి వీరివురూ చర్చించారు. తితిదేతో కలిసి పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డిని సుబ్బారెడ్డి కోరారు.

hyderabad metro rail md met ttd chairman yv subba reddy
hyderabad metro rail md met ttd chairman yv subba reddy

By

Published : Feb 14, 2020, 8:14 PM IST

తిరుపతి నుంచి తిరుమల మార్గంలో రద్దీ తగ్గించడానికి లైట్ మెట్రో వాహన విధానం బాగుంటుందని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పారు. శ్రీ పద్మావతి అతిథి గృహంలో తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుపతి, తిరుమలలో ట్రాఫిక్ తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాల గురించి చర్చించారు. తిరుపతి రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి శ్రీవారి మెట్ల మార్గం ద్వారా రవాణా మెరుగు పరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలు, రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి వరకు సుందరీకరణ గురించి చర్చించారు. భవిష్యత్తులో తిరుపతి, తిరుమలను అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక దివ్యకేంద్రాలుగా తీర్చిదిద్దడానికి తితిదే అధికారులతో కలిసి పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని వైవీ సుబ్బారెడ్డి ఎన్వీఎస్ రెడ్డిని కోరారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details