కొవిడ్ సోకిన శతాధిక వృద్ధురాలు (101) వైరస్ను జయించింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను తిరుపతి సిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు అందించిన చికిత్సతో ఆ వృద్ధురాలు కోలుకుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న ఆమెను వైద్యులు శనివారం సాయంత్రం డిశ్చార్జ్ చేశారు. కరోనాను జయించి డిశ్చార్జ్ అయిన శతాధిక వృద్ధురాలు... కరోనా పాజిటివ్ రోగులకు స్పూర్తిగా నిలిచింది.
కరోనాను జయించిన శతాధిక వృద్ధురాలు
చిత్తూరు జిల్లాలో ఓ శతాధిక వృద్ధురాలు కరోనాను జయించింది. సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకొని కోలుకున్న ఆ వృద్ధురాలిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. ఆ వృద్ధురాలు ఇతర రోగులకు స్పూర్తిగా నిలుస్తోంది. ఆమె ధైర్యాన్ని వైద్యులు కొనియాడారు.
కరోనాను జయించిన శతాధిక వృద్ధురాలు