Tirumala: కొవిడ్ కారణంగా రెండేళ్లుగా ఆగిపోయిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను.. ఆఫ్‌లైన్‌లో లక్కీడిప్ ద్వారా భక్తులకు కేటాయించే విధానం గురువారం సీఆర్‌వో జనరల్ కౌంటర్‌లో ప్రారంభమైంది. ఉదయం నుంచే భక్తులు పెద్ద ఎత్తున చేరుకుని ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేర్లు నమోదు చేసుకున్నారు. సాయంత్రం 6 గంటలకు ఆటోమేటేడ్ రాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ద్వారా ఎల్‌ఈడీ స్క్రీన్‌లో మొదటి డిప్ తీశారు. అలాగే రాత్రి 8.30 గంటలకు రెండోసారి లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవలకు భక్తులను ఎంపిక చేశారు. ఒక్కసారి అవకాశం వస్తే మరో ఆరునెలల వరకు తిరిగి వారు ఆర్జిత సేవలను పొందేందుకు అనుమతించరు.
వారికి ప్రత్యేక దర్శన టోకెన్లు..:వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను విడుదల చేయనుంది. ఏప్రిల్ నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటాను.. 8వ తేదీన ఉదయం 11 గంటలకు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.