ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరద నీరు ముంచెత్తడంతో తిరుపతి(heavy rain in tirupati) శ్రీకృష్ణనగర్ లోని ఇళ్ల గోడలకు బీటలు(Cracks in houses in Tirupati) బారుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరద నీరు రోజులు తరబడి కాలనీలలో నిల్వ ఉండటంతో పునాదులు(Shrinking Houses in Tirupati) కుంగుతున్నాయి.
శ్రీకృష్ణ నగర్ లోని 8వ క్రాస్ లో 18 ఇళ్లకు గోడలు పగుల్లిచ్చాయి. మూడంతస్తుల భవనం గోడలు బీటలు బారడంతో కూలిపోయే స్థితికి చేరింది. బీటలు బారిన భవనం సమీపంలోని ఇళ్ల పై పడేందుకు అవకాశం ఉండటంతో ఆ భవనాన్ని కూల్చేందుకు నగరపాలక అధికారులు చర్యలు చేపట్టారు. వరదనీరు నిల్వ ఉండటంతో పాటు బలహీనమైన నిర్మాణాలతో భవనాలు కూలిపోయే పరిస్ధితి నెలకొందని అధికారులు తెలిపారు. శ్రీకృష్ణనగర్లో ఇళ్ల గోడలు పగుళ్ళు వచ్చిన ప్రాంతాన్ని శాసనసభ్యుడు కరుణాకర్ రెడ్డితో పాటు తెదేపా నేతలు పరిశీలించారు. వరదతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వ సాయం అందేలా చర్యలు చేపడతామని కరుణాకర్ రెడ్డి తెలిపారు.