చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాళ్యం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఉస్తికాయలపెంట గ్రామంలో.. ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుండగా తెదేపా వర్గీయులు అడ్డుకున్నారు. అధికారులను నిలదీయడంతో పట్టా పత్రాలను సచివాలయంలో ఉంచి అక్కడి నుంచి సిబ్బంది జారుకున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
ఎన్నికల నియమావళిని అతిక్రమించి.. ఇళ్ల పట్టాల పంపిణీ - ఎన్నికల నియమావళిని అతిక్రమించి ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన వైకాపా నాయకులు
ఎన్నికల నియమావళిని అతిక్రమించి.. చిత్తూరు జిల్లా ఎర్రవారిపాళ్యంలో వైకాపా నాయకులు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పట్టాల పంపిణీ సమయంలో తెదేపా నేతలు వారిని అడ్డుకున్నారు.
ఎన్నికల నియమావళిని అతిక్రమించి.. ఇళ్ల పట్టాల పంపిణీ