తాత్కాలిక, శాశ్వత ఉద్యోగి అనే దానితో సంబంధం లేకుండా ఒకే పనిని నిర్వర్తిస్తున్నప్పుడు ఇతర ఉద్యోగుల మాదిరిగానే ప్రతి ఉద్యోగి సమాన వేతనం పొందేందుకు అర్హత ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ విధంగా చెల్లించకపోతే వారి పట్ల వివక్ష చూపడం, అధికరణ 14ను ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేసింది.
సుప్రీం అప్పుడే చెప్పింది..
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ ఆర్జిత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేసింది. పిటిషనర్లలో ఒకే తరహా పనిని నిర్వర్తిస్తున్న వారికి చెల్లిస్తున్న వేతనం, ప్రయోజనాల మాదిరి పిటిషనర్లకూ ఒప్పంద కార్మికులు తక్షణం చెల్లించాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, తితిదే ఈవో, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల డిప్యూటీ డైరెక్టర్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చారు.
2011లోనే వాజ్యం దాఖలు..
శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో ఒప్పంద కార్మికులుగా ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి గతంలో కల్పించిన కనీస వేతనాలు, ప్రయోజనాలను తమకు వర్తింపచేయాలని 11 మంది చిరు ఒప్పంద కార్మికులు 2011లో హైకోర్టును ఆశ్రయించారు.
సమాన వేతనాలు వర్తింప చేయలేదు..
2003, 2004 నుంచి శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో పాలు మోయడం, పాల క్యాన్లను శుభ్రపరచడం, పాలు వేడిచేయడం తదితర పనులు ఒప్పంద కార్మికులుగా పనిచేస్తున్నామన్నారు. తితిదే బోర్డు 2007 నవంబర్ 12న చేసిన తీర్మానం ప్రకారం.. గో సంరక్షణ శాలలో అప్పటికే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 73 మంది ఒప్పంద కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసి ప్రయోజనాలు కల్పించారన్నారు.
'కనీస వేతనం వర్తింపజేయాలి'