ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతి ఏడో డివిజన్​లో ఎన్నికల నిలుపుదలపై హై కోర్టులో పిటిషన్.. విచారణ వాయిదా - తిరుపతి ఏడో డివిజన్ ఎన్నిక నిలుపదలపై విచారణ సోమవారానికి వాయిదా

ఎన్నికలు నిలిపివేసే అధికారం ఎస్​ఈసీకి లేదంటూ.. సుజాత అనే అభ్యర్థి హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. తిరుపతి నగరపాలక సంస్థ ఏడో డివిజన్​లో.. సంతకాన్ని ఫోర్జరీ చేసి తన నామినేషన్ ఉపసంహరించారని తెదేపా అభ్యర్థిని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్​ఈసీ విచారణ జరిపి.. అక్కడ ఎన్నికల నిర్వహణ ఆపేసింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

high court adjourned hearing on tirupati seventh division election
తిరుపతి ఏడో డివిజన్​ ఎన్నిక నిలుపుదలపై హైకోర్టు విచారణ వాయిదా

By

Published : Mar 6, 2021, 7:51 AM IST

తిరుపతి నగరపాలక సంస్థ ఏడో డివిజన్​లో ఎన్నికలు నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. సుజాత అనే అభ్యర్థి వేసిన అత్యవసర పిటిషన్​పై హైకోర్టు విచారణ జరిపింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు ఎస్ఈసీకి సమయమిస్తూ.. న్యాయమూర్తి జస్టిస్ డీపీఎస్ఎస్ సోమయాజులు విచారణను సోమవారానికి వాయిదా వేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి నామినేషన్ ఉపసంహరించారని.. తెదేపా అభ్యర్థిని ఎం.విజయలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఘటనపై విచారణ జరిపించిన ఎస్​ఈసీ.. ఏడో డివిజన్​లో ఎన్నికలు నిలిపివేస్తూ ఈ నెల 4న ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల నిలుపుదలకు ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఎస్​ఈసీకి లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ వాదనలు వినిపించారు. ఓసారి ఎన్నికలు ప్రారంభం అయ్యాక.. ముగిసే వరకు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. నామినేషన్ ఉపసంహరణ విషయంలో రిటర్నింగ్ అధికారికి సంబంధం లేదని పేర్కొన్నారు. విజయలక్ష్మి ఏజెంట్ మోసానికి పాల్పడ్డారనేది ప్రాథమిక సమాచారమని.. ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టుకు తెలిపారు. అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీచేసి ఆమెకు తెలియకుండా అతడే నామినేషన్ ఉపసంహరించాడని చెప్పారు. ఈ సందర్భంలో విచారణ జరిపి.. ఎన్నికను నిలిపివేసే అధికారం ఎస్ఈసీకి ఉందన్నారు. సోమవారం నాటికి పూర్తి వివరాలు వెల్లడవుతాయని వివరించారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. విచారణను అప్పటికి వాయిదా వేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details