ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Hero Vishal: పునీత్ చదివించే పిల్లల బాధ్యత తీసుకుంటా: విశాల్‌ - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విశాల్

సినీ నటుడు విశాల్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కన్నడ నటుడు పునీత్ మరణం తీరని లోటని.. పునీత్ చదివిస్తున్న పిల్లల బాధ్యతను తాను తీసుకుంటున్నట్లు చెప్పారు.

hero vishal  visit tirumala
hero vishal visit tirumala

By

Published : Nov 3, 2021, 10:35 AM IST

తిరుమల శ్రీవారిని సినీ నటుడు విశాల్ దర్శించుకున్నారు. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం తీరని లోటని.. పునీత్ ట్రస్టు ద్వారా చదివిస్తున్న పిల్లల భాద్యతను ఇకపై తాను తీసుకుంటున్నట్లు నటుడు విశాల్‌ తెలిపారు. మంగళవారం రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో కొండపైకి చేరుకున్న నటుడు స్వామి సేవలో పాల్గొన్నారు.

తమ కుటుంబంలో ఒకడైన పునీత్​ను కోల్పోవడం బాధాకరమన్న విశాల్.. ఆయన చేసిన మంచి పనులు కొనసాగించాలనే ఉద్దేశంతో పిల్లలను చదివిచే భాద్యతను తీసుకుంటానన్నారు. ఇల్లు కొనేందుకు పెట్టుకున్న డబ్బులను పునీత్‌ ఆశయాలను కొనసాగించేందుకు ఉపయోగిస్తానని చెప్పారు.

hero vishal: పునీత్ చదివించే పిల్లల బాధ్యత తీసుకుంటా: విశాల్‌

ABOUT THE AUTHOR

...view details