TTD News: శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శన టోకెన్లు జారీ చేసే తిరుపతిలోని శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్‌ల్లోని కౌంటర్ల వద్ద భక్తులు బారులుదీరారు. కరోనా తగ్గుముఖంతో సాధారణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) సర్వదర్శనం టికెట్ల సంఖ్య పెంచుతూ వచ్చింది. దీంతో భక్తులు తిరుమలకు భారీ సంఖ్యలో వస్తున్నారు.
TTD: సర్వదర్శన టోకెన్లకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లలో బారులు - many devotees visited tirumala
Devotees for Sarva Darshan tokens: వారాంతం కావడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. సర్వదర్శన టోకెన్ల కోసం కౌంటర్ల వద్ద భక్తులు బారులుదీరారు.
Tirumala
మరోవైపు ఇవాళ సర్వదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు ఈ నెల 12వ తేదీ నాటికి దర్శన స్లాట్ లభిస్తుందని తితిదే తెలిపింది. భక్తుల అధిక రద్దీ కారణంగా బుధవారం నాటి సర్వదర్శనం టోకెన్లు మంగళవారం మధ్యాహ్నం నుంచి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లు కేటాయించమని తెలిపింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని తితిదే కోరింది.