Rush at Tirumala : శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేయడంతో ఆందోళనకు దిగుతున్నారు. వరుస సెలవులు కావడంతో శ్రీవారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి తరలివచ్చారు. అయితే.. ఈనెల 12వ తేదీ వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ శనివారం రోజే పూర్తికావడంతో ఆది, సోమ వారాల్లో టోకెన్ల జారీ నిలిపివేశారు. దీనిపై సమాచారం లేకపోవడంతో భక్తులు.. తిరుపతికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సర్వదర్శనం టోకెన్లు జారీ చేయాలని ఆందోళనకు దిగారు. తితిదే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Special Darshanam at Tirumala: కరోనాతో రెండేళ్లుగా రద్దు చేసిన వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి ప్రత్యేక ప్రవేశ దర్శనాలను తితిదే పునరుద్ధరించింది. రోజుకు వెయ్యి టికెట్ల చొప్పున సమయ నిర్దేశిత టోకెన్లను తితిదే ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. టికెట్లు తీసుకున్న భక్తులను ప్రతిరోజు ఉదయం 10 గంటలకు దర్శనానికి అనుమతిస్తున్నారు..