Heavy rush to Tirumala: తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. కంపార్ట్‌మెంట్లు నిండి శ్రీవారి సేవాసదన్ వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 40 గంటల సమయం పడుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో అప్రమత్తమైన తితిదే అధికారులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. భక్తుల మధ్య తోపులాటలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి నియంత్రిస్తున్నారు. కిలోమీటర్ల మేర విస్తరించిన క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు లేకుండా.. అన్నప్రసాదాల పంపిణీ చేపట్టారు. భక్తుల రద్దీ దృష్ట్యా.. ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలతోపాటు, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సిఫారసు లేఖలతోపాటు.. వృద్ధులు, వికలాంగులు, చంటి బిడ్డల ప్రత్యేక దర్శనాలను రద్దు చేసింది.
Tirumala: ఈనెల 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే తెలిపింది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకుని తిరుమలకు రావాలని కోరింది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచించారు.