ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తాలో... భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తిరుమలలో...
తిరుమలలో రాత్రి నుంచి కురుస్తున్న వానకు యాత్రికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడం వల్ల వృద్ధులు, చంటి పిల్లలు వణికిపోతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానతో తిరుమల వీధులు, రహదారులు జలమయమయ్యాయి.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లాలో ఉదయం నుంచి పడుతున్న జల్లులతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వల్ల రోడ్ల మీదే నీరు నిలబడి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. శివార్లలో నీరు నిలిచి ప్రజలకు ఇక్కట్లు తెచ్చిపెట్టాయి.