రాష్ట్రంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తిరుపతిలో..
తిరుపతి నగరంలో ఉదయం కురిసిన కుండపోత వర్షంతో నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. మధురా నగర్, లక్షీపురం కూడలి, లీలామహల్ కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, అన్నపూర్ణ గుడి తదితర ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో వరద నీరు చేరింది.
కడపలో...
కడపలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. పలు నివాసాల్లోకి మోకాలు లోతు వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.