ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల తోపులాట.. ఐదు రోజులపాటు బ్రేక్​ దర్శనాలు రద్దు - శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట

heavy rush at ticket counter
తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట

By

Published : Apr 12, 2022, 9:37 AM IST

Updated : Apr 12, 2022, 1:00 PM IST

09:35 April 12

తోపులాటలో ముగ్గురు భక్తులకు గాయాలు

తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్ల జారీ కేంద్రం వద్ద తోపులాట

Heavy Crowd: శ్రీ వారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. తిరుపతిలో సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్న మూడు కేంద్రాల వద్ద... భక్తుల రద్దీ పెరగటంతో తోపులాట జరిగింది. రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. భక్తుల రద్దీ పెరగడంతో... టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాలలో తోపులాట జరిగి.. ముగ్గురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు.

భక్తుల ఆవేదన: తాము తిరుపతికి చేరుకుని మూడు, నాలుగు రోజులు అవుతుందని... టోకెన్లు మాత్రం ఇవ్వటం లేదని భక్తులు వాపోతున్నారు. భోజనం, మంచినీళ్లు వంటి సదుపాయాలు లేక చిన్నపిల్లలతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇవ్వకపోయినా కనీసం కొండపైకి కూడా అనుమతించట్లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొండపైకి అనుమతిస్తే తలనీలాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటామని వాపోతున్నారు. ఏళ్లుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నామని... గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈటీవీ-భారత్​ కథనాలకు స్పందన: శ్రీవారి భక్తుల కష్టాలను వెలుగులోకి తెచ్చిన ఈటీవీ-భారత్​ కథనాలపై తితిదే అధికారులు స్పందించారు. ఉదయం నుంచి భక్తుల కష్టాలను కళ్లకు కట్టినట్లు ఈటీవీ-భారత్​ ప్రసారం చేసింది. దీనిపై స్పందించిన తితిదే... భక్తులకు దర్శన టోకెన్లు లేకున్నా తిరుమలకు అనుమతిస్తున్నారు.

రేపటి నుంచి బ్రేక్‌ దర్శనాలు రద్దు: రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ప్రకటించింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

ఇదీ చదవండి: బండ లాగుడు పోటీలో అపశృతి.. ఎడ్లబండి పైనుంచి కిందపడ్డ ఎమ్మెల్యే

Last Updated : Apr 12, 2022, 1:00 PM IST

ABOUT THE AUTHOR

...view details