తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో నూతనంగా గ్రీన్ మంత్ర బ్యాగులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తితిదే అధికారులు తెలిపారు. ఈ బ్యాగుల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదని అన్నారు. 180 రోజుల్లో ఈ బ్యాగు ఎరువుగా మారుతుందని చెప్పారు.
తిరుమలలో ఇక నుంచి గ్రీన్ మంత్రా లడ్డూ బ్యాగులు - తిరుమల తాజా వార్తలు
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రంలో నూతనంగా ‘గ్రీన్ మంత్ర బ్యాగు’లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న కాగితం, జనపనార సంచుల ధరలు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
![తిరుమలలో ఇక నుంచి గ్రీన్ మంత్రా లడ్డూ బ్యాగులు తిరుమలలో ఇక నుంచి గ్రీన్ మంత్రా లడ్డూ బ్యాగులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10713181-812-10713181-1613898420821.jpg)
తిరుమలలో ఇక నుంచి గ్రీన్ మంత్రా లడ్డూ బ్యాగులు
ప్రస్తుతం అందిస్తున్న కాగితం, జనపనార సంచుల ధరలు అధికంగా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్లాస్టిక్ రహిత బ్యాగులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. 5 లడ్డూలు పట్టే బ్యాగు ధర రూ.3, 10 లడ్డూలు పట్టేది రూ.6కు అందిస్తున్నామని అన్నారు.
ఇదీ చదవండి: లోయలోపడి సైనికుడి మృతి
Last Updated : Feb 21, 2021, 2:37 PM IST