తిరుపతిలో గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజున స్వామి మోహినీ అవతారంలో దర్శనమిచ్చారు. పల్లకీపై సుందరంగా ముస్తాబై ఆశీనులైన స్వామివారు.. మోహినీ అవతారంలో భక్తులకు అభయమిచ్చారు. కొవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో.. ఆలయంలో ఏకాంతంగా వాహనసేవ నిర్వహించారు.
వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించిన అర్చకులు.. వాహన సేవ అనంతరం ఉత్సవ వరులకు స్నపన తిరుమంజనం ఘట్టాన్ని వేడుకగా చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు గరుడవాహనంపై స్వామి దర్శనమిస్తారు.