ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీ గోవిందరాజస్వామివారికి వైభవంగా కల్పవృక్ష వాహన సేవ - Kalpavriksham vahana seva to Sri Govindarajaswamy

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు 4వ రోజు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ ఉదయం స్వామివారికి కల్పవృక్ష వాహన సేవను కన్నులపండువగా నిర్వహించారు.

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

By

Published : May 21, 2021, 4:31 PM IST

తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజు ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఉదయం శ్రీ‌దేవి, భూదేవి స‌మేత స్వామివారు శ్రీ‌గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనంపై కటాక్షించారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంపై ఆశీనులైన స్వామి, అమ్మ‌వార్ల‌కు అర్చకులు ఏకాంతంగా వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.

అనంతరం ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం నిర్వ‌హించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బ‌రినీళ్లు, ప‌సుపు, చందనంల‌తో అభిషేకం చేశారు. సాయంత్రం సర్వభూపాలవాహనంపై స్వామివారు దర్శనమిస్తారు. కరోనా కారణంగా వాహనసేవను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.


ఇదీ చూదవండి..వైభవంగా గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details