ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలు రద్దు చేయాలి'

శ్రీవారి ఏడు కొండలపై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలకు రద్దు చేసుకోకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని ట్వీట్ చేశారు.

nara lokesh
nara lokesh

By

Published : Dec 24, 2020, 10:27 AM IST

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి తిరుమల పాదయాత్రలో డ్రోన్ల వినియోగంపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. శ్రీవారి కొండలపై డ్రోన్లు ఎగరవేయడం అపచారం, అరిష్టమని అన్నారు. ముఖ్యమంత్రి జగన్​కి దేవుడంటే లెక్కలేదని... ప్రజలంటే గౌరవం లేదని లోకేశ్ విమర్శించారు. అలాగే వైకాపా నాయకుల అహంకారానికి హద్దేలేదని దుయ్యబట్టారు.

భక్తులపై ప్రభుత్వం లాఠీ ఛార్జి చేయించి హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని లోకేశ్ అన్నారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే నిర్ణయాలకు రద్దు చేసుకోకపోతే ఆ కలియుగ దైవం ఆగ్రహానికి గురికాక తప్పదని ట్వీట్ చేశారు. వెంకన్నతో పెట్టుకుంటే ఏమవుతుందో సీఎం జగన్​కు బాగా తెలుసని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details