ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుమలలో శాస్త్రోక్తంగా గోపూజ - తిరుమలలో శాస్త్రోక్తంగా గోపూజ

తిరుమలలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగనాయకుల మండపం వేదికగా డిసెంబర్ 13వ తేదీ వరకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలను చేస్తున్నట్టు తెలిపారు.

Gopuja at thirumala thirupathi
తిరుమలలో శాస్త్రోక్తంగా గోపూజ

By

Published : Nov 23, 2020, 7:30 AM IST

తిరుమల తిరుపతి దేవస్థానంలో గోపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. రంగనాయకుల మండపం వేదికగా డిసెంబర్ 13వ తేదీ వరకు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలను చేస్తారు. ఇందులో భాగంగా గోపాష్టమిని పురస్కరించుకుని...ఆవు, దూడలకు పూజలు చేసి నైవేద్యం, హార‌తి స‌మ‌ర్పించారు. గోప్ర‌ద‌క్షిణ చేశారు.

గోపూజ ముక్కోటి దేవతల పూజ ఫలంతో సమానమని పండితులు తెలిపారు. తొలుత కార్తీక విష్ణు పూజ సంక‌ల్పంతో పూజను ప్రారంభించి... ప్రార్థ‌నా సూక్తం, విష్ణుపూజ మంత్రంను ప‌ఠించారు. స్వామి, అమ్మ‌వార్ల‌కు తిరువారాధ‌న చేశారు. అనంత‌రం క్షమా ప్రార్థ‌న‌, మంగ‌ళంతో ముగించారు.

ABOUT THE AUTHOR

...view details