ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రేపు తిరుపతిలో గోల్డెన్ జూబ్లీ విజయ దివాస్ ఉత్సవాలు - Indo-Pak war in 1971 news

తిరుపతిలో గురువారం స్వర్ణోత్సవ విజయ దివాస్ వేడుకలు నిర్వహించనున్నారు. భారత్-పాక్ యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నారు.

Golden Jubilee Vijaya Diwas in Tirupahi
బ్రిగేడియన్ జె.జె.ఎస్.బిందార్

By

Published : Feb 17, 2021, 5:16 PM IST

భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ వేదికగా గురువారం స్వర్ణోత్సవ విజయ దివాస్ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు బ్రిగేడియన్ జె.జె.ఎస్. బిందార్ పేర్కొన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ గిరీషతో కలిసి మాట్లాడారు.

1971లో జరిగిన భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తిరుపతి నుంచి ప్రాతినిధ్యం వహించిన ముగ్గురు మాజీ సైనికులను ఘనంగా సత్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హాజరుకానున్నారని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details