తిరుపతి శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ హోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా గోమందిరంలో గో పూజ నిర్వహించారు. గజరాజు, అశ్వాలు, వృషభాలకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం గోవులకు దాణా పెట్టారు.
శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ మహోత్సవం..పాల్గొన్న తితిదే ఛైర్మన్ సతీమణి - తిరపతి నేటి వార్తలు
కనుమ పండుగను పురస్కరించుకొని తిరుపతి శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ కన్నుల పండగగా సాగింది. గోమందిరంలో గజరాజు, అశ్వాలు, వృషభాలకు పూజలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
![శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో గోపూజ మహోత్సవం..పాల్గొన్న తితిదే ఛైర్మన్ సతీమణి go pooja at Tirupati](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10254639-603-10254639-1610719574917.jpg)
శ్రీ వేంకటేశ్వర గో సంరక్షణశాలలో గోపూజ మహోత్సవం
ఆర్య వైశ్య మహాజన సభకు చెందిన మహిళలు ప్రత్యేకంగా రూపొందించిన గొబ్బమ్మలతో పూజలు నిర్వహించారు. దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భజనలు, కోలాటాలు నిర్వహించారు. తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత గోశాలలోని శ్రీవేణుగోపాల స్వామి ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి: నరసరావుపేటలో గోపూజ మహోత్సవం.. పాల్గొన్న సీఎం జగన్