తిరుమలలో కైశికద్వాదశి ఆస్థానం కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించింది. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తిరుచ్చీపై తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం బంగారు వాకిలి చెంత ఆస్థానంను అర్చకులు వేడుకగా నిర్వహించారు.
Tirumala : శ్రీవారికి వైభవంగా.. "కైశిక ద్వాదశి ఆస్థానం"
తిరుమలలో "కైశిక ద్వాదశి ఆస్థానం" కార్యక్రమాన్ని తితిదే వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయంలో స్నపనబేరంగా పిలువబడే ఉగ్ర శ్రీనివాసమూర్తిని, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను తిరుచ్చీపై తిరుమాఢ వీధుల్లో ఊరేగించారు.
వైభవంగా శ్రీవారికి కైశికద్వాదశి ఆస్థానం
ఏడాదిలో కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఊరేగింపు నిర్వహిస్తారు. వేకువజామున నాలుగున్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి : TTD : పరిమళాలు జల్లుతున్న శ్రీవారి పూజా పూల అగరుబత్తీలు...