తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి రోజున తెప్పోత్సవాలను ప్రారంభించి పౌర్ణమి వరకు తితిదే నిర్వహిస్తుంది. తెప్పోత్సవాలలో భాగంగా తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర ఉత్సవమూర్తులను తిరువీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. కోనేరులో విద్యుద్దీపాలు, పుష్పాలతో అలంకరించిన తెప్పపై స్వామివారు దర్శనమిచ్చారు. తెప్పపై మూడు సార్లు విహరిస్తూ.. స్వామివారు భక్తులకు అభయమిచ్చారు.
వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం - వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభం
Theppotsavam at Tirumala: తిరుమలలో వైభవంగా శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర ఉత్సవమూర్తులు తెప్పపై విహరిస్తూ.. భక్తులకు అభయ ప్రదానం చేశారు.
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు