ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అర్హులకే ఉద్యోగాలు ఇవ్వండి... వైకాపా కార్యకర్తలకు కాదు' - tirupati latest news

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను వైకాపా కార్యకర్తలకు కట్టబెడుతున్నారని టీఎన్​ఎస్​ఎఫ్ జాతీయ సమన్వయకర్త నాయుడు ఆరోపించారు. మెరిట్ లిస్టు ఆధారంగా ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

tnsf
tnsf

By

Published : Aug 27, 2020, 7:48 PM IST

మెరిట్ లిస్టు ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ సమన్వయకర్త నాయుడు డిమాండ్ చేశారు. తిరుపతిలోని తెదేపా కార్యాలయంలో గురువారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో మెరిట్ ఆధారంగా కాకుండా వైకాపా నేతల సంబంధికులకు ఉద్యోగాలు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అర్హులకు న్యాయం చేయండి... వైకాపా కార్యకర్తలకు కాదు.. అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ABOUT THE AUTHOR

...view details