తిరుమలలో వైభవంగా గరుడ వాహనసేవ
తిరుమలలో పౌర్ణమి గరుడవాహన సేవను తితిదే వైభవంగా నిర్వహించింది. పరిమళభరిత పూలమాలలు, విశేష తిరువాభరణాలతో సర్వాలంకార భూషితుడైన స్వామివారు.. గరుడవాహనాన్ని అధిరోహించి భక్తులను కటాక్షించారు. తిరుమాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకున్న భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.