విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని తెదేపానేత గంటా శ్రీనివాసరావు తిరుపతిలో డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కుపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయని... ప్రైవేటీకరణ అంశాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని గంటా అన్నారు. తన పదవికి రాజీనామా చేస్తే విమర్శలు చేస్తున్నారన్న గంటా... సరైన ఫార్మాట్ లేదంటే మరోసారి రాజీనామా చేశానని గుర్తు చేశారు.
'విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నాం' - Ganta Srinivasa Rao latest news
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకపోతున్నామని తెదేపా నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. కేంద్రం నిర్ణయంపై పునరాలోచించాలని గంటా డిమాండ్ చేశారు.
గంటా శ్రీనివాసరావు