బ్లాక్ ఫంగస్ మందులను అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను తిరుపతి అర్బన్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి నాలుగు కంపెనీలకు చెందిన 50 మైకోజుమన్ ఎంపిటర్ ఇంజెక్షన్లు సీజ్ చేశామని అర్బన్ జిల్లా ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. చెన్నై, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. చెన్నై నుంచి ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నాయని ఎస్పీ తెలిపారు. 7 వేల రూపాయల ఖరీదైన ఒక్కో ఇంజక్షన్‌ను గరిష్టంగా 30 వేల రూపాయల వరకు అమ్ముతున్నట్లు విచారణలో గుర్తించామని ఎస్పీ తెలిపారు.
ARREST: బ్లాక్ మార్కెట్లో బ్లాక్‌ఫంగస్ ఔషధాల విక్రయం.. ముఠా అరెస్ట్ - tirupathi crime news
బ్లాక్ ఫంగస్ ఔషధాలను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న పది మందిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు చెన్నై నుంచి బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు సరఫరా చేస్తున్నట్లు ఎస్పీ వెంకటప్పలనాయుడు తెలిపారు.
బ్లాక్ మార్కెట్లో బ్లాక్‌ఫంగస్ ఔషధాల విక్రయం.. ముఠా అరెస్ట్
Last Updated : Jun 25, 2021, 5:59 PM IST