తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై తితిదే ఈవో ఏ.కే. సింఘాల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు తిరుమలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 24న శ్రీవారి ఆలయంలో కోయల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. అదేనెల 29న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 30న ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో తెలిపారు. భద్రత కోసం ఆలయ పరిసరాల్లో 15 వందల సీసీటీవీ కెమేరాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 37 చోట్ల ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
24న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.. 29న అంకురార్పణ - సెప్టెంబర్ 30 నుంచి తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు
సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 8 వరకు తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. 30న ముఖ్యమంత్రి జగన్ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని ఈవో ఏ.కే. సింఘాల్ తెలిపారు.
om namo narayanaya