ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

శ్రీవారిని భక్తులకు దూరం చేసే కుట్ర: తితిదే మాజీ సభ్యుడు - ttd foemer member on ttd prasadam

తితిదే మాజీ సభ్యుడు ఏ.వీ.రమణ వైకాపా ప్రభుత్వం, తితిదేపై ధ్వజమెత్తారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని భక్తులకు దూరం చేసే కుట్ర జరుగుతుందని ఆరోపించారు.

శ్రీవారిని భక్తులకు దూరం చేసే కుట్ర: తితిదే మాజీ సభ్యుడు

By

Published : Nov 16, 2019, 7:41 PM IST

శ్రీవారిని భక్తులకు దూరం చేసే కుట్ర: తితిదే మాజీ సభ్యుడు

కలియుగ దైవం వెంకటేశ్వరస్వామిని భక్తులకు దూరం చేసే కుట్ర జరుగుతుందని... తితిదే మాజీ సభ్యుడు ఏ.వీ.రమణ ఆరోపించారు. భగవంతునికి, భక్తులకు అనుసంధానంగా ఉంటామన్న వైకాపా ప్రభుత్వం... ఇప్పుడు శ్రీనివాసుడుకి భక్తులకు మధ్య గోడ కడుతోందన్నారు. వీఐపీ దర్శనాల పేరుతో... బ్రోకర్లు భక్తులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. వందల సంఖ్యలో దళారులు కొండపై రాజ్యమేలుతున్నారని ధ్వజమెత్తారు.

సామాన్య భక్తులను కొండకు రాకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు తితిదే చేస్తోందని ట్వీట్ చేశారు. అతిథి గృహాల ధరలు రెండింతలు చేశారని... ఇప్పుడు భారీగా లడ్డు రేట్లు పెంచేస్తున్నారని రమణ పేర్కొన్నారు. తితిదే తీసుకుంటున్న నిర్ణయాలు... రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అనేక అనుమానాలకు దారితీస్తున్నాయని ట్విట్టర్​లో పేర్కొన్నారు.

ఇవీ చూడండి-రాయితీ లడ్డూలకు మంగళం పాడే యోచనలో తితిదే!

ABOUT THE AUTHOR

...view details