తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి కె.రత్నప్రభ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పార్టీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని భాజపా వర్గాలు తెలిపాయి. రత్నప్రభ సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఆమె 1981 బ్యాచ్ కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారిణి. కర్ణాటక ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె... 2018 జూన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీవిరమణ చేశారు. 2019లోనే ఆమె భాజపాలో చేరారు. ఆమె భర్త ఎ.విద్యాసాగర్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్ అధికారి. రత్నప్రభ కూడా కొన్నాళ్లు డిప్యూటేషన్‌పై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేశారు.
తిరుపతి భాజపా అభ్యర్థిగా రత్నప్రభ..? - tirupati bypoll news
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థిగా విశ్రాంత ఐఏఎస్ అధికారిణి కె.రత్నప్రభ పేరు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఒకటి రెండు రోజుల్లో పార్టీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

bjps tirupati bypoll candidate