ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తిరుపతిలోని హోటళ్లలో ఆహార భద్రతాధికారుల తనిఖీలు - tirupati latest news

తిరుపతిలో జోరుగా కల్తీ ఆహార విక్రయాలు జరుగుతున్నాయి. మంగళవారం రైల్వేస్టేషన్​ ఎదురుగా ఉన్న హోటల్​లో ఆహార భద్రతా, విజిలెన్స్​ అధికారుల తనిఖీలు చేయగా అసలు విషయం బయటపడింది. రెండు, మూడు రోజులపాటు నిల్వ ఉంచిన ఆహారాన్ని ప్రయాణికులకు విక్రయిస్తున్నారు. ఆహార పదార్థాల నమూనాలు సేకరించి దుకాణదారునిపై కేసు నమోదు చేశారు.

food safety officers rides on hotels
తిరుపతిలో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

By

Published : Mar 17, 2020, 11:43 PM IST

తిరుపతిలో ఆహార భద్రతా అధికారుల తనిఖీలు

తిరుపతి హోటళ్లపై కొంతకాలంగా ఫిర్యాదులు ఎక్కువ కావడం వల్ల మంగళవారం ఆహార భద్రతా, విజిలెల్స్​ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రైల్వేస్టేషన్​ ఎదురుగా ఉన్న హోటల్​లో తనిఖీలు చేయగా ఎక్కువగా కల్తీ ఆహారాన్ని ప్రయాణికులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు, మూడు రోజుల పాటు నిల్వ ఉన్న ఆహారాన్ని ప్రయాణికులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిషేధిత రసాయనాలు వాడడమే కాకుండా నాణ్యతలేని సరుకులు, కూరగాయలు వినియోగించి తయారుచేసి యాత్రికులకు, ప్రయాణికులకు అంటగడుతున్నారు. తినడానికి ఏ మాత్రం ఉపయోగపడని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని వాటిని ధ్వంసం చేశారు. ఆహార పదార్థాల నమానాలను సేకరించి యజమానిపై కేసు నమోదు చేశారు. వీటితో పాటుగా గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో ఇక నిరంతరం దాడులు నిర్వహించి కల్తీ ఆహారాన్ని విక్రయించకుండా అడ్డుకుంటామని ఆహార భద్రతా అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details