తిరుమల శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు అందుబాటులోకి రావడంతో తిరుపతిలో యాత్రికుల(TOURISTS) రద్దీ పెరిగింది. యాత్రికుల సందడి మొదలవడంతో తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులను మోసగించేందుకు సిద్ధమవుతున్న హోటల్ యజమానులను నియంత్రించేందుకు ఆహార భద్రత కల్తీ నియంత్రణ అధికారులు(FOOD SAFETY OFFICERS) రంగంలోకి దిగారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో వచ్చే యాత్రికులకు కల్తీ ఆహారాన్ని అందిస్తున్నట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో చిత్తూరు జిల్లా ఆహార భద్రత కల్తీ నియంత్రణ అధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో అధికారులు... యాత్రికులు రద్దీగా ఉన్న బస్టాండ్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న హోటళ్లపై దాడులు నిర్వహించారు.
TIRUMALA: పెరిగిన రద్దీ...అప్రమత్తమైన ఆహార భద్రత కల్తీ నియంత్రణ అధికారులు - తిరుమల ప్రధాన వార్తలు
తిరుమల శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు అందుబాటులోకి రావడంతో తిరుపతిలో యాత్రికుల రద్దీ పెరిగింది. యాత్రికుల సందడి మొదలవడంతో తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులను మోసగించేందుకు సిద్ధమవుతున్న హోటల్ యజమానులను నియంత్రించేందుకు ఆహార భద్రత కల్తీ నియంత్రణ అధికారులు(FOOD SAFETY OFFICERS) రంగంలోకి దిగారు.
దాడుల్లో భాగంగా కుళ్లిన కూరగాయలు, ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన చపాతీలు, హానికరమైన రసాయనాలు ఉపయోగించి తయారు చేసిన గోబి, పాచిపోయిన నూడిల్స్, కల్తీ తేయాకు, అపరిశుభ్రమైన వాతావరణంలో వంటల తయారీని అధికారులు గుర్తించారు. అధిక ధరలు వసూలు చేస్తున్నప్పటికీ కల్తీ ఆహారం ఇవ్వడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని వాటిని చెత్తబుట్టలో పడేశారు. హోటల్ నిర్వాహకులకు తాఖీదులు జారీ చేసి నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారం రోజుల పాటు తిరుపతి నగరంలో దాడులు నిర్వహిస్తామని చిత్తూరు జిల్లా ఆహార భద్రత కల్తీ నియంత్రణాధికారి ప్రభాకర్ రావు తెలిపారు.