విద్యార్థినితో ఆకతాయిల అసభ్య ప్రవర్తన... నలుగురు అరెస్ట్ - చంద్రగిరిలో విద్యార్థినితో ఆకతాయిల అసభ్య ప్రవర్తన
HARASSMENT: రాష్ట్రంలో రోజురోజుకు అకతాయిల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అమ్మాయి కనిపిస్తే చాలు వెంబడించి వేధిస్తున్నారు. అసభ్యకరంగా ప్రవర్తించి హింసిస్తున్నారు. తాజాగా చంద్రగిరిలో ఓ విద్యార్థినిని.. ఐదుగురు ఆకతాయిలు అడ్డుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు.
HARASSMENT: తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. నేండ్రగుంట సమీపంలో విద్యార్థిని కళాశాల నుంచి ఆటోలో ఇంటికెళ్తుండగా.. ఐదుగురు యువకులు అడ్డుకున్నారు. చంద్రగిరి నాగాలమ్మ మలుపు వద్ద కారులో వచ్చి.. అసభ్యంగా ప్రవర్తించారు. వారిలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకోగా ఒకరు పారిపోయారు. నాలుగు సెల్ఫోన్లు, కారు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ యువకులు అన్నమయ్య జిల్లా కోడూరుకు చెందిన తరుణ్, మహేశ్వర్ రెడ్డి, ఉదయ్ కిరణ్, అల్తాఫ్‌గా పోలీసులు గుర్తించారు.
ఇవీ చదవండి: